వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి | Proceed forward in the spirit of Vivekananda | Sakshi
Sakshi News home page

వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి

Oct 9 2016 10:10 PM | Updated on Sep 4 2017 4:48 PM

వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి

వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి

చండూరు : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ రామచందర్‌ రావు పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గట్టుప్పలలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

చండూరు : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ రామచందర్‌ రావు పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గట్టుప్పలలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మాట్లాడారు. వివేకానందుడు ఓ గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రతి యువకుడికి దేశ భక్తిపై గౌరవం ఉండాలన్నారు. దేశంలో అత్యధికంగా యువత ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. రానున్న కాలంలో బీజేపీకి తిరుగు లేని విజయం ఖాయమన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతం నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టి రాష్ట కోశా«ధికారి డాక్టర్‌ మనోహార్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ నామని జగన్నాథం, రావిరాల శ్రీను, చిల్కూరి అశోక్, శివకుమార్, నన్నూరి రాంరెడ్డి, యాస అమరేందర్‌ రెడ్డి, గంజి క్రిష్ణయ్య, సోమ నర్సింహ, కోమటి వీరేశం, కర్నాటి శ్రీను, అమరేందర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement