డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.
	- ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
	
	మహబూబ్‌నగర్: ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నాటెళ్లి గ్రామం సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు జాతీయరహదారిపై నాటెళ్లి వద్ద ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొనటంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
