చారకొండ మండల ఏర్పాటుపై కసరత్తు | planing the charakonda mandal | Sakshi
Sakshi News home page

చారకొండ మండల ఏర్పాటుపై కసరత్తు

Sep 9 2016 11:26 PM | Updated on Sep 4 2017 12:49 PM

వంగూరు : మండల పరిధిలోని చారకొండ గ్రామాన్ని మండల కేంద్రం చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభమయింది. శుక్రవారం మెప్మా పీడీ లింగ్యానాయక్‌ వంగూరు, చారకొం డ గ్రామాల్లో పర్యటించారు. వంగూరు రెవెన్యూ కార్యాలయంలో మండలానికి సంబంధించిన మ్యాపు, గ్రామాల మధ్య ఉన్న దూరాన్ని పరి శీలించారు.

–సౌకర్యాల కోసం పీడీ అధ్యయనం
వంగూరు : మం డల పరిధిలోని చారకొండ గ్రామాన్ని మండల కేం ద్రం చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభమయింది. శుక్రవారం మెప్మా పీడీ లింగ్యానాయక్‌ వంగూరు, చారకొం డ గ్రామాల్లో పర్యటించారు. వంగూరు రెవెన్యూ కార్యాలయంలో మండలానికి సంబంధించిన మ్యాపు, గ్రామాల మధ్య ఉన్న దూరాన్ని పరి శీలించారు. అనంతరం చారకొండ గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి, భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను పరిశీలించారు. అయితే గ్రామంలోని అతిథిగృహం, గ్రామపంచాయతీ కార్యాలయంతోపాటు ఇతర భవనాలను అఖిలపక్ష నాయకులు చూపించారు. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement