హైదరాబాద్‌కు పవన్‌ కళ్యాణ్‌ | pawankalyan going to hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు పవన్‌ కళ్యాణ్‌

Sep 10 2016 9:51 PM | Updated on Mar 22 2019 5:33 PM

జనసేన అధినేత నేత పవన్‌కళ్యాణ్‌ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయన కాకినాడ నుంచి రెండున్నర గంటలు ముందుగానే రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. టెర్మినల్‌ భవనం వీఐపీ లాంజ్‌లో భోజన విరామం తర్వాత సేదతీరారు.

మధురపూడి :
జనసేన అధినేత నేత పవన్‌కళ్యాణ్‌ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయన కాకినాడ నుంచి రెండున్నర గంటలు ముందుగానే రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. టెర్మినల్‌ భవనం వీఐపీ లాంజ్‌లో భోజన విరామం తర్వాత సేదతీరారు. తనlకోసం వచ్చిన మీడియాకు ముఖం చాటేశారు. అభిమానులను ఒక్కొక్కరినీ టెర్మినల్‌భవనంలోకి అనుమతించిన పోలీసులు, అధికారులు మీడియాకు మాత్రం అనుమతివ్వలేదు. నార్త్‌జోన్‌ డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ తీరుకు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement