లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు: పవన్ కల్యాణ్ | pawan kalyan oppose land pooling in AP capital area | Sakshi
Sakshi News home page

లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు: పవన్ కల్యాణ్

Aug 23 2015 2:26 PM | Updated on Mar 22 2019 5:33 PM

లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు: పవన్ కల్యాణ్ - Sakshi

లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు: పవన్ కల్యాణ్

టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుతో గొడవ పెట్టుకోవాలనుకోవడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.

పెనుమాక: టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుతో గొడవ పెట్టుకోవాలనుకోవడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీతో గొడవ పెట్టుకోవడానికి ఎంతోసేపు పట్టదన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోవాలన్నారు. భూములు ఇవ్వని రైతుల నుంచి లాక్కోవొద్దని స్పష్టం చేశారు. ఆనందంతో కట్టే రాజధాని కావాలిగానీ కన్నీళ్లతో కట్టింది కాదన్నారు. గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులతో ఆదివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే....

* నటుడిగానో, రాజకీయ నాయకుడిగా ఇక్కడి రాలేదు రైతుగా వచ్చాను
* నేను రాజకీయాల్లోకి రావడానికి రెండే కారణాలు ఒకటి రైతు సమస్య, రెండు శాంతిభద్రతల సమస్య
* నేను మీకు అండగా ఉన్నాను, పారిపోవడం లేదు
* వీధి పోరాటాల కోసం రాజకీయ పార్టీలు అవసరం లేదు
* టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు
* వైఎస్సార్ సీపీ నేతలు నాకు శత్రువులు కాదు
* వ్యక్తిగతంగా నాకు ఎవరూ శత్రువులు లేరు
* ఏ పార్టీ ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు
* ప్రత్యేక పరిస్థితుల్లోనే టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చా
* నేను ప్రజల పక్షం, జనం పక్షం
* నాకు పరిమితులు ఉన్నాయి, నా శక్తి మేరకు పోరాటం చేస్తున్నా
* టీడీపీ నేతల మాటలు నాకు బాధ కలిగించాయి
* అభివృద్ధికి ఆటంకం కలిగించేవాడిని అయితే టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను?
* మిత్రపక్షం అంటే బానిస కాదు
* తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యను ప్రజల కోసమే ఎదిరించాను
* అన్నయ్య మనసు గాయపర్చి టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చాను
* అధికారం కావాలని కోరుకోలేదు
* సమస్యను పరిష్కరించేందుకు చావుకు కూడా వెనుకాడను
* నా చిత్తశుద్ధిని శంకిస్తే నేను వేరే వ్యక్తిని
* మాటలు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించొచ్చు
* ప్రత్యేక ప్యాకేజీ కోసం సిన్సియర్ గా ప్రయత్నించాలని సూచించా
* ప్రజల దగ్గర నుంచి భూమి సేకరించకుండానే రాజధాని కడతామన్నారు
* రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని ఆకాంక్షించాను
* ఆనందంతో కట్టే రాజధాని కావాలిగానీ కన్నీళ్లతో కట్టింది కాదు
* అభివృద్ధి కోసం పొలాలను నాశనం చేయడం నాకు బాధ కలిగిస్తోంది
* ప్రజల సమస్యల ముందుకు తీసుకెళ్తే  నన్ను అభివృద్ధి నిరోధకుడు అంటున్నారు
* ఆప్ట్రాల్ 3400 ఎకరాల భూమికే ఇంత రాద్ధాంతం చేస్తారా అని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు
* అధికారంలో ఉన్నవారు ఆప్ట్రాల్ అనే పదాన్ని మాట్లాడొద్దు
* అవుటర్ రింగ్ రోడ్డులో లాక్కున్న కొంతభూమి కోసం టీడీపీ ఎంపీ మురళీమోహన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు?
* భూసేకరణ చేస్తే కచ్చితంగా ధర్నా చేస్తాను
* రైతులు ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోండి, ఇష్టపడని రైతులను ఒప్పించి తీసుకోండి
* బలవంతంగా భూములు లాక్కోవద్దు.. లాక్కోవద్దు.. లాక్కోవద్దు
* దయచేసి నాకు కులాలు అంటగట్టకండి
* నేను రెచ్చగొట్టడానికి మాట్లాడడం లేదు. ఒక్కసారి ఆలోచించండి
* గల్లా జయదేవ్, మురళీమోహన్ రైతుల సమస్యలు వినాలని కోరుకుంటున్నా
* రైతు సమస్యలపై సీఎం చంద్రబాబు మానవతా దృక్పధంతో వ్యవహరించాలి
* ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం రాకపోతే రైతులకు జవాబుదారీ ఎవరు?
* ప్రభుత్వం భూములు లాక్కుంటున్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి
* నేను ఎక్కడికీ పారిపోను, రైతుల వెంటే ఉంటాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement