ఘనంగా పవిత్రోత్సవం | pavitra utsavam for kartikeya swami | Sakshi
Sakshi News home page

ఘనంగా పవిత్రోత్సవం

Jul 27 2016 11:41 PM | Updated on Jul 6 2019 12:52 PM

ఘనంగా పవిత్రోత్సవం - Sakshi

ఘనంగా పవిత్రోత్సవం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి కార్తికేయుడి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన ఆషాడ కృత్తిక మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

మోపిదేవి :
 ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి కార్తికేయుడి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన ఆషాడ కృత్తిక మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏటా స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకూ ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు నిర్వహించే ఆషాడ కృత్తిక మహోత్సవానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ సమయంలో స్వామిని దర్శించుకున్న వారి కోర్కెలు నెరవేరుతాయని విశ్వాçÜం. సంతానం లేనివారు, వివాహం కానివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రుభయం వెంటాడుతున్నవారు, రాహు, కేతు, కుజ, సర్ప దోషాలున్న వారిని స్వామి అనుగ్రహిస్తాడని నమ్మకం. శతాబ్దాల కాలం నాటి నాగమల్లి వృక్షం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమై పూజలందుకుంటోంది. కోర్కెలు తీర్చాలని మనస్సులో తలచుకుని ఈ వృక్షానికి ముడుపు కడతారు. కోర్కెలు నెరవేరిన తరువాత స్వామివారిని దర్శించుకుని కానుకలు చెల్లించుకుంటారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement