పైలేరియా మందుల పంపిణీని విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

పైలేరియా మందుల పంపిణీని విజయవంతం చేయాలి

Published Fri, Aug 12 2016 12:36 AM

పైలేరియా మందుల పంపిణీని విజయవంతం చేయాలి - Sakshi

  • జాతీయ ఆరోగ్య మిషన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ అనురాధ
  • నర్మెట : ప్రభుత్వం చేపట్టిన పైలేరియా మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ మేడోజు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం నులిపురుగుల నివారణ మందుల పంపిణీని ఆమె పరిశీలించారు. తొలుత ఆర్‌డీ అనురాధ స్థానిక పీహెచ్‌సీలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోదకాలు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. దోమకాటుతో వచ్చే బోదకాలు నివారణ మాత్రలు ప్రతీ ఒక్కరూ వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, వరంగల్‌లో మాత్రమే బోదకాలు వ్యాధి తీవ్రత ఉందని, దీనిపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరంగల్‌ జిల్లాలో 17 పీహెచ్‌సీల పరిధిలో మాత్రమే సమస్య ఉందన్నారు. ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌పీహెచ్‌ఓ పి.కరుణాకర్‌రాజు, క్లస్టర్‌ ఇ¯Œæచార్జి వీరబాబు, ఫాతిమాబేగం, రహమాన్, ఏఎన్‌ఎంలు సునంద, కరుణ, ఆశకార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement