మండలంలోని కొక్కంటిక్రాస్ నుంచి బుధవారం ములకలచెరువుకు గొర్రెల ఎరువుతో వెళుతున్న లారీ పాపాఘ్ని బిడ్జివద్ద టైరు పగలడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న మట్టిపెల్లలను ఢీకొంది.
తనకల్లు : మండలంలోని కొక్కంటిక్రాస్ నుంచి బుధవారం ములకలచెరువుకు గొర్రెల ఎరువుతో వెళుతున్న లారీ పాపాఘ్ని బిడ్జివద్ద టైరు పగలడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న మట్టిపెల్లలను ఢీకొంది. డ్రైవర్ వెంకటరమణకు బలమైన గాయాలై క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. లారీలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు కలీలు స్వల్పంగా గాయపడ్డారు.స్థానికలు అతికష్టం మీద డ్రైవర్‌ను బయకు తీసి 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


