
7న ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం
జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో ఈ నెల 7న ప్రతిభా ( 2016) అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ ఎంఎం సర్కార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో ఈ నెల 7న ప్రతిభా ( 2016) అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ ఎంఎం సర్కార్ ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్నటువంటి అనుబంధ కళాశాలలు, అటానమస్ కళాశాలల్లో 177 మంది విద్యార్థులకు ప్రతిభా అవార్డులు, గోల్డ్‌మెడల్స్, ట్యాబ్స్, రూ.20వేలు నగదును ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులు వారి ఐడీ కార్డును, ఆధార్ జిరాక్స్, ప్రశంసాపత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.