ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి | Oil tanker collide, killing one person | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

Jan 6 2016 9:48 AM | Updated on Sep 28 2018 3:41 PM

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

అర్వపల్లి: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారం బంగ్లా సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరపోయిన పాపయ్య(55) ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా.. తిరుమలగిరి నుంచి సూర్యాపేట వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పాపయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement