మోదీ నిర్ణయంపై ‘బాబు’ బడాయి | notes kanna babu jaggireddy | Sakshi
Sakshi News home page

మోదీ నిర్ణయంపై ‘బాబు’ బడాయి

Nov 9 2016 11:53 PM | Updated on Sep 4 2017 7:39 PM

మోదీ నిర్ణయంపై ‘బాబు’ బడాయి

మోదీ నిర్ణయంపై ‘బాబు’ బడాయి

రావులపాలెం : నల్లధనం అరికట్టేందుకు రూ.500 రూ.వెయ్యి నోట్ల రద్దు చేస్తే అదంతా తాను రాసిన లేఖ వల్ల నే జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. అంత పలుకుబ

రావులపాలెం :  నల్లధనం అరికట్టేందుకు రూ.500 రూ.వెయ్యి నోట్ల రద్దు చేస్తే అదంతా తాను రాసిన లేఖ వల్ల నే జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. అంత పలుకుబడి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని హితవుపలికారు. రావులపాలెం వైఎస్సార్‌ పీపీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ సంచలనం జరిగిన అది తన వల్లే జరిగిందని చెప్పుకునే నాయకుల్లో చంద్రబాబు ప్రథమ నాయకుడన్నారు. ముందుగా తెలిసే పెద్ద నోట్లపై చంద్రబాబు జాగ్రత్తపడి ప్రధాని లేఖ రాసారేమోనని అనుమానం కలుగుతుందన్నారు. నల్ల్లధనం అరికట్టే చర్యలకు వైఎస్సార్‌ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. నల్లధనంతో కుబేర్లుగా మారిపై గురిపెట్టే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే జిల్లాలో వైఎస్సార్‌ సీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమానికి గ్రామగ్రామాన అపూర్వ ఆదరణ లభిస్తుందని కన్నబాబు అన్నారు. ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబు ఒక ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చేస్థాయికి రాజకీయాలు దిగజారడం చూసి భయపడి మోదీ ఈ నోట్లను రద్దు చేసి ఉంటారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగితే జనం నిలదీస్తారనే భయంతో మోటారు సైకిళ్ళపై పారిపోయే జన చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, కలవచర్ల సర్పంచ్‌ గానుగుల కృష్ణార్జున రావు, తదితరులు పూల మాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్‌?ర నాగిరెడ్డి, జిల్లా పారిశ్రామిక విభాగం కన్వీనర్‌ మంతెన రవిరాజు, ఎంపీటీసీలు జవ్వాది రవిబాబు, కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, మండల కన్వీనర్లు దొమ్మే టి అర్జునరావు, తమ్మన శ్రీను, నందం సూరిబాబు, కోనాల రాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement