ఆత్మకూర్ : మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆత్మకూర్, చిన్నచింతకుంట, అమరచింత మండలాలను విడగొట్టి వనపర్తిలో కలిపితే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, సీతమ్మ, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు.
వనపర్తి వద్దు.. పాలమూరే ముద్దు
Sep 10 2016 11:03 PM | Updated on Oct 8 2018 5:07 PM
ఆత్మకూర్ : మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆత్మకూర్, చిన్నచింతకుంట, అమరచింత మండలాలను విడగొట్టి వనపర్తిలో కలిపితే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, సీతమ్మ, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ జూనియర్ కళాశాల ఆవరణలో సర్పంచ్ గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కలపకముందే ఇక్కడ ఉన్న నీటిని ఎక్కడెక్కడికో తరలించుకుపోయి అక్కడి చెరువులు, కుంటలు సైతం నింపుకొంటున్నారని విమర్శించారు. అన్ని అర్హతలున్న ఆత్మకూర్‌ను డివిజన్, నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలన్నారు.
Advertisement
Advertisement