అలరించిన సంగీత కచేరి | musical programme in puttaparthy | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Sep 11 2016 11:58 PM | Updated on Sep 4 2017 1:06 PM

ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి.

పుట్టపర్తి టౌన్‌ : ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి.  మూడో రోజు వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పలువురు వక్తలు ప్రసంగాలతో పాటు, కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ భక్తులు వేదపఠనంతో సాయంత్రం వేడుకలు ప్రారంభమయ్యాయి.

కేరళ సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ గోపకుమార్, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు  చైర్మన్‌ ప్రయర్‌ గోపాలకష్ణ తదితరులు సత్యసాయి వైభవాన్ని, ఓనం వేడుకల విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ప్రసిద్ధ కేరళ సంగీత విద్వాంసురాలు అంభ్లి బందం సంగీత కచేరి నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement