ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని ఏజేసీ తిరుపతిరావు అన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్‌లో శిక్షణ పొందిన యువ రైతులకు శుక్రవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతిరావు హాజరై మాట్లాడారు.
-
-ఏజేసీ తిరుపతిరావు
-
శిక్షణ పొందిన యువ రైతులకు సర్టిఫికెట్ల పంపిణీ
పోచమ్మమైదాన్ : ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని ఏజేసీ తిరుపతిరావు అన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్‌లో శిక్షణ పొందిన యువ రైతులకు శుక్రవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతిరావు హాజరై మాట్లాడారు.
రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాలని, మార్కెట్ రేటుకు అనుగుణంగా పంటలు వేయాలని సూచించారు. అనంతరం కంది, సోయాబీన్, జవార్, వరి క్షేత్రాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉష, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ డాక్టర్ రఘురామిరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, ఉమారెడ్డి పాల్గొన్నారు.