వివాహిత అనుమానాస్పద మృతి | married women dead | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Sep 16 2016 11:09 PM | Updated on Sep 4 2017 1:45 PM

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన వన్‌టౌన్‌ పోలీసు స్టేçÙన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతి ఉరి వేసుకొని ఇంట్లో మృతి చెందగా భర్త కనిపించకుండా పోవటం, చుట్టుపక్కల వారు సరైన సమాచారం చెప్పలేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

 
విజయవాడ(వన్‌టౌన్‌):
 వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన వన్‌టౌన్‌ పోలీసు              స్టేçÙన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతి ఉరి వేసుకొని ఇంట్లో మృతి చెందగా భర్త కనిపించకుండా పోవటం, చుట్టుపక్కల వారు సరైన సమాచారం చెప్పలేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి  వెళితే.. బ్రాహ్మణవీధి పాత పోస్టాఫీస్‌ సెంటర్‌లో కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో బత్తు మల్లికార్జునరావు, చంద్రకళ (20) కుటుంబం నివాసముంటుంది. అతను క్యాటరింగ్‌ పనులకు సప్లయర్లను అందించి వచ్చే కమీషన్‌పై జీవిస్తున్నాడు. ఆయనకు గతంలో ఒక వివాహమవ్వగా ఆమె నుంచి విడాకులు తీసుకొని చంద్రకళను ఏడాది కిందట వివాహం చేసుకున్నాడు. తొలి భార్య సంతానమైన కుమార్తె కూడా వీరి వద్దనే ఉంటుంది. శుక్రవారం ఉదయం మల్లికార్జునరావు నుంచి డబ్బులు తీసుకుందామని రమణ వీరి ఇంటికి వచ్చాడు. అతని కుటుంబం రెండో అంతస్తులో ఉండటంతో ఆ మెట్లు ఎక్కుతుండగా దుర్వాసన రావటంతో రమణ పోలీసులకు సమాచారమందించాడు. వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా చంద్రకళ ఉరి వేసుకొని కనిపించింది. ఇతరుల నుంచి మృతురాలి భర్త ఫోన్‌ నెంబర్లు తీసుకొని చేయగా స్విచాఫ్‌ అని వచ్చాయి. ఆరు మాసాల కిందటే వీరు ఇక్కడకు వచ్చారని, స్థానికులతో పెద్దగా కలవరంటూ చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. ఆదివారం భార్యాభర్తలు గొడవ పడినట్లు స్థానికులు చెప్పారు. అప్పటి నుంచి ఆయన కనపడలేదని, అతనితోపాటు కుమార్తె కూడా కనపడలేదని తెలిపారు. 
ఆదివారం తరువాత చంద్రకళను ఎవరూ చూడకపోవటంతో ఆ రెండు రోజుల్లోనే ఆమె ఉరి వేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో లభించిన ఆమె ఫోన్‌ ఇతర సమాచారం ఆధారంగా చంద్రకళ తల్లిదండ్రులు చీరాలలో ఉంటున్నట్లు గుర్తించి వారికి సమాచారమందించారు. 
బంధువులు, ఇతర కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవటంతో శవాన్ని కిందకు దించలేదు. చీరాల నుంచి ఆమె బంధువులు నగరానికి వచ్చిన తరువాత మృతదేహాన్ని తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. వన్‌టౌన్‌ సీఐ వెంకటే శ్వర్లు కేసును పరిశీలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement