అనంతపురంలో దారుణం | Man kills brother wife in Anathapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో దారుణం

Jan 30 2016 6:13 PM | Updated on Sep 3 2017 4:38 PM

అనంతపురం జిల్లా గోరెంట్ల మండలం కలావులపల్లి తండాలో శనివారం దారుణం చోటుచేసుకుంది.

గోరెంట్ల(అనంతపురం): అనంతపురం జిల్లా గోరెంట్ల మండలం కలావులపల్లి తండాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన శివశంకర్ నాయక్ తన తమ్ముని భార్య లక్ష్మీదేవిని కిరాతకంగా నరికి చంపాడు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన ఇద్దరు చిన్నారులు ఐదేళ్ల లోపు వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement