చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య | man killed in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

Jul 31 2016 1:40 PM | Updated on Sep 4 2017 7:13 AM

రైస్ మిల్లులో పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు.

చిత్తూరు : రైస్ మిల్లులో పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వజ్రవారి కండ్రీగలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసిస్తున్న సుందరరామిరెడ్డి (55) రైలు మిల్లులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సుందరరామిరెడ్డిపై  ఆగంతకులు దాడి చేశారు. అనంతరం అతన్ని కత్తులతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం వారు పరారైయ్యారు.

ఆదివారం ఉదయం సుందరరామిరెడ్డి మృతదేహన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement