తాటికాయల కోసం వెళ్లి... | man falls from tree | Sakshi
Sakshi News home page

తాటికాయల కోసం వెళ్లి...

Published Wed, Apr 26 2017 12:27 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

గార్లదిన్నె(శింగనమల): పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన సంజీవరెడ్డి(35) గార్లదిన్నె మండలం ఎగువపల్లి శివార్లలోని చెట్టు పై నుంచి పడి మంగళవారం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంజీవరెడ్డి ఎగువపల్లిఇ చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి ఐచర్‌ వాహనానికి నాలుగేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు వివరించారు.

గార్లదిన్నె(శింగనమల): పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన సంజీవరెడ్డి(35) గార్లదిన్నె మండలం ఎగువపల్లి శివార్లలోని చెట్టు పై నుంచి పడి మంగళవారం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంజీవరెడ్డి ఎగువపల్లిఇ చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి ఐచర్‌ వాహనానికి నాలుగేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు వివరించారు. రోజూ టమాటాల లోడుతో హైదరాబాద్‌ వెళ్లేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో పని లేకపోవడంతో క్లీనర్‌తో కలసి గ్రామ సమీపంలోని తాటి చెట్టు వద్దకు వెళ్లాడన్నారు. అక్కడ తాటికాయల కోసం చెట్టుపైకెక్కిన అతను అదుపు తప్పి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి  భార్య, ఇద్దకు కుమార్తెలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement