పాముకాటుతో మృతి | man dies of snake byte | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మృతి

Apr 30 2017 11:45 PM | Updated on Jul 12 2019 3:31 PM

మండలంలోని డి.కొండాపురానికి చెందిన బోయ రాజు(25) పాముకాటుకు గురై ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

రాయదుర్గం రూరల్ : మండలంలోని డి.కొండాపురానికి చెందిన బోయ రాజు(25) పాముకాటుకు గురై ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తన స్నేహితలతో కలసి శనివారం రాత్రి అడవిలోకి వేటకు వెళ్లిన రాజు.. దారిలో పాముకాటుకు గురయ్యాడన్నారు. వెంటనే అతన్ని గ్రామంలోని నాటువైద్యుని వద్దకు తీసుకెళ్లారు. మూత్ర విసర్జన కాక పోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో  తుదిశ్వాస వదిలాడని చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, కుమారుడు నాలుగేళ్ల కుమారుడు శంకర, రెండేళ్ల కుమార్తె అమృత ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement