రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి | man died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

Aug 20 2016 9:57 PM | Updated on Sep 28 2018 3:41 PM

చింతపల్లి : అతి వేగంతో దూసుకు వచ్చిన ఓ వాహనం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి అతని మృతికి కారణమైంది.lఈ సంఘటన మండల పరిధిలోని నసర్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

చింతపల్లి :  అతి వేగంతో దూసుకు వచ్చిన ఓ వాహనం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి అతని మృతికి కారణమైంది.lఈ సంఘటన మండల పరిధిలోని నసర్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చింతపల్లి ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి మండల కేంద్రానికి చెందిన నల్లా మాసయ్య (45) నసర్లపల్లి సమీపంలోని నిమ్మ తోటలో పని చేస్తున్నాడు. తోట నుంచి∙శుక్రవారం రాత్రి నసర్లపల్లి వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో కొండమల్లేపల్లి వైపు నుంచిlపుష్కరాలకు వెళ్లి వస్తున్న టవేరా వాహనం మాసయ్యను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆయన్ను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.  డ్రైవర్‌ మద్యం మత్తులో, అజాగ్రత్తతో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మృతుడి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement