మక్తల్ : నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని డి మాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు మూడురోజుల పాటు బంద్‌కు పిలుపునివ్వగా అన్ని వర్గాలు సంపూర్ణంగా మద్దతు తెలపడంతో నిరసనలు, ఉద్రిక్తల మధ్య విజయవంతమైంది. గురువారం అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
-
అంతర్‌రాష్ట్ర రహదారిపై రాస్తారోకో
-
యువకుడి ఆత్మహత్యాయత్నం
మక్తల్ : నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని డి మాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు మూడురోజుల పాటు బంద్‌కు పిలుపునివ్వగా అన్ని వర్గాలు సంపూర్ణంగా మద్దతు తెలపడంతో నిరసనలు, ఉద్రిక్తల మధ్య విజయవంతమైంది. గురువారం అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. మక్తల్ పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్క గ్రా మాల ప్రజలు తరలివచ్చి అంతర్‌రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేశారు. అధికార పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇఫ్టూ, సీపీఐ న్యూడెమక్రసీ, వైఎస్‌ఆర్‌సీపీ, అంబేద్కర్, టీ జేఏసీ, వివిధ కుల, కార్మిక సంఘాలతోపాటు భారతీయ జీవిత భీమా ఏజెంట్లు రాస్తారోకోలో పాల్గొన్నారు. అంతకుముందు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. రహదారిపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు. సమావేశంలో అఖిల పక్షం నాయకులు డీసీఎంఎస్ చైర్మన్ నిజాం పాష, జెడ్పీటీసీ సభ్యుడు వాకిటి శ్రీహరి, మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీలు కొండయ్య, ఆశిరెడ్డి, చంద్రకాంత్‌గౌడ్, బస్వరాజ్, అని ల్, సోంశేఖర్‌గౌడ్, తిరుపతి, వెంకటేశ్వర్లు, జయప్రకాష్, మున్వర్‌అలీ పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వం మక్తల్‌ను గద్వాలలో కలిపే ఆలోచనను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ మక్తల్ మండలం మాద్వార్‌కు చెందిన రామకృష్ణ అనే యువకుడు ఒంటిపై పెట్రో ల్ పోసుకుని ఆత్మహత్యా యత్రానికి పాల్పడ్డాడు. అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చే స్తున్న సమయంలో ఉద్వేగానికి లోనై ని నాదాలు చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే అక్కడున్న యువకులు, పో లీసులు అడ్డుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు.