చేబ్రోలు శివారు పెదచెరువు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. హైవే విస్తరణ పనుల్లో భాగంగా గ్రావెల్ తరలిస్తున్న లారీ ఎదురుగా వెళ్తున్న చేబ్రోలుకు చెందిన చేదులూరి లోవరాజుకు చెందిన ఎద్దుల బండిని ఢీకొని అదుపుతప్పి
చెట్టును ఢీకొన్న లారీ : డ్రైవర్ మృతి
Dec 2 2016 11:42 PM | Updated on Sep 29 2018 5:26 PM
గొల్లప్రోలు :
చేబ్రోలు శివారు పెదచెరువు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. హైవే విస్తరణ పనుల్లో భాగంగా గ్రావెల్ తరలిస్తున్న లారీ ఎదురుగా వెళ్తున్న చేబ్రోలుకు చెందిన చేదులూరి లోవరాజుకు చెందిన ఎద్దుల బండిని ఢీకొని అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును, విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో లారీ డ్రైవర్ మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లా బిలారావ్‌కు చెందిన సూరజ్‌బా¯ŒSయాదవ్ (34) లారీ కేబి¯ŒSలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ ఢీకొట్టిన తీవ్రతకు చెట్టు, విద్యుత్‌స్తంభం ధ్వంసమయ్యాయి. లారీ చక్రాలు సైతం ఊడిపడ్డాయి. ఎద్దుల బండి స్వల్పంగా దెబ్బతింది. అతివేగంగా లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏఎస్‌ఐ కృష్ణబాబు కేసు దర్యాçప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement