ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకొని ఎదురు తిరిగిన రైతులపై లాఠీచార్జి చేయడం అన్యాయం సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.
లాఠీచార్జి అన్యాయం : సీపీఎం
Jul 27 2016 12:57 AM | Updated on Aug 13 2018 8:12 PM
సూర్యాపేట : ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకొని ఎదురు తిరిగిన రైతులపై లాఠీచార్జి చేయడం అన్యాయం సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వకుండా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో చెప్పకుండానే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో పల్లేటి వెంకన్న, వేల్పుల వెంకన్న, సైదులు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement