పాముకాటుతో మహిళ కన్నుమూత | Lady died by snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ కన్నుమూత

Jul 25 2016 11:56 PM | Updated on Sep 4 2017 6:14 AM

మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మానాపురం లక్ష్మి (30) పాముకాటుతో మరణించింది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

సాలూరు రూరల్‌ : మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మానాపురం లక్ష్మి (30) పాముకాటుతో మరణించింది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి సోమవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పాము కాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మతురాలికి భర్త వెంకటరావు, ఇద్దరు కుమారులున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement