కృష్ణా పుష్కరాల భక్తులకు అల్పాహారం | krishna pushkaralu in tiffin hyway | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాల భక్తులకు అల్పాహారం

Aug 17 2016 12:54 AM | Updated on Sep 4 2017 9:31 AM

రాయికల్‌(షాద్‌నగర్‌ రూరల్‌): ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్యవైశ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఉచిత అల్పాహారం అందజేశారు.

రాయికల్‌(షాద్‌నగర్‌ రూరల్‌): ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్యవైశ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఉచిత అల్పాహారం అందజేశారు. అల్పాహార కార్యక్రమం మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. వనితా, వాసవీక్లబ్‌ ఆర్థిక సహకారంతో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. పుష్కరాలు ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంఘం సభ్యులు తెలిపా రు. పుష్కరాలకు వెళ్లే భక్తులకు దారిలో అల్పాహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆకారపునాగరాజు, వసుందర, సురేష్, శశిధర్, సూర్యప్రకాష్, విజయ్‌కుమార్, శారద, సుగుణ, బాల్‌రాజ్, కృష్ణయ్య, సంతోష్, ప్రభాకర్, లక్ష్మయ్య, నరేందర్‌. సింహ్మయ్య, సుభాష్, నరేష్, భారతి, వెంకటేష్, నర్సింలు, నందీశ్వర్, చంద్రయ్య, భారతి, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement