
రోడ్డు ప్రమాదంలో వైరా ఎమ్మెల్యేకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలో...
చివ్వెంల: రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భానోతు మదన్‌లాల్ నాయక్ తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లా అక్కల దూవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. కారు ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న ఎమ్మెల్యే నడుముకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎముకలకు ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించారు. ఆయనతోపాటు ఇద్దరు గన్‌మెన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిమ్స్ ఆస్పత్రిలోని మిలీనియం బ్లాక్ 218లో చికిత్స పొందుతున్న మదన్‌లాన్‌ను పరామర్శించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.