రాజస్థాన్‌లో పనిచేస్తున్న మెట్‌పల్లి వాసి అదృశ్యమయ్యాడు. జైపూర్‌లోని మహేంద్ర కంపెనీలో పని చేస్తున్న పిడుగు రమేష్ అనే యువకుడు ఐదు రోజుల క్రితం ఇంటికి వస్తున్నానని సమాచారం అందించాడు.
మెట్‌పల్లి (కరీంనగర్) : రాజస్థాన్‌లో పనిచేస్తున్న మెట్‌పల్లి వాసి అదృశ్యమయ్యాడు. జైపూర్‌లోని మహేంద్ర కంపెనీలో పని చేస్తున్న పిడుగు రమేష్ అనే యువకుడు ఐదు రోజుల క్రితం ఇంటికి వస్తున్నానని సమాచారం అందించాడు. అప్పటి నుంచి ఇంటికి రాకపోగా, అక్కడ కూడా లేకపోవడంతో స్నేహితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన పిడుగు రమేష్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్ల క్రితం జైపూర్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. శుభకార్యం ఉండటంతో ఐదు రోజుల క్రితం ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటికీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సోమవారం జైపూర్ బయలుదేరారు.