Karimnagar resident
-
జైపూర్‌లో కరీంనగర్ వాసి అదృశ్యం
మెట్పల్లి (కరీంనగర్) : రాజస్థాన్‌లో పనిచేస్తున్న మెట్పల్లి వాసి అదృశ్యమయ్యాడు. జైపూర్‌లోని మహేంద్ర కంపెనీలో పని చేస్తున్న పిడుగు రమేష్ అనే యువకుడు ఐదు రోజుల క్రితం ఇంటికి వస్తున్నానని సమాచారం అందించాడు. అప్పటి నుంచి ఇంటికి రాకపోగా, అక్కడ కూడా లేకపోవడంతో స్నేహితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన పిడుగు రమేష్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్ల క్రితం జైపూర్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. శుభకార్యం ఉండటంతో ఐదు రోజుల క్రితం ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటికీ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సోమవారం జైపూర్ బయలుదేరారు. -
గల్ఫ్‌లో కరీంనగర్‌వాసి మృతి
కరీంనగర్ (కథలాపూర్) : కథలాపూర్ మండలం దొంపేట గ్రామానికి చెందిన నక్కల లక్ష్మయ్య(55) గుండెపోటుతో గల్ఫ్‌లో ప్రాణాలు విడిచాడు. లక్ష్మయ్య ఏడాదిన్నర క్రితం పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో స్టీల్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. గుండెపోటుతో సోమవారం మృతిచెందినట్లు తెలిసింది. కుటుంబసభ్యులకు ఆలస్యంగా మంగళవారం ఈ సమాచారం అందింది. లక్ష్మయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. -
దుబాయిలో కరీంనగర్ వాసి మృతి
సిద్దిపేట(కరీంనగర్): దుబాయిలో కూళీ పనులు చేస్తూ కోనాయిపల్లి వాసి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోనాయిపల్లి గ్రామానికి చెందిన మల్లమారి రాములు (50) దుబాయిలో 25 సంవత్సరాలుగా కూలీ పనులు చేస్తున్నాడు. రెండు సంవత్సరాల కిందట కూతురు వివాహం జరిపించి తిరిగి దుబాయి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న క్రమంలో రాములుకు గుండెపోటు రావడంతో మృతి చెందాడని సమాచారం అందింది. తన భర్త మృతదేహన్ని ఇండియాకు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని బార్య ఎల్లవ్వ వేడుకుంటొంది. -
గల్ఫ్‌లో జీవచ్ఛవంలా ఆరేళ్లు
కోనరావుపేట: బతుకుదెరువు కోసం ఎడారిదేశం వెళ్లిన ఓ అభాగ్యుడు ఆరేళ్లుగా జీవచ్ఛవంగా ఆస్పత్రి లో ఉన్నాడు. అచేతనావస్థలో ఉన్న అతడి పరిస్థితిపై స్పందించేవారే కరువయ్యారు. రాజయ్య బంధువుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన బడే రాజయ్య(40) రూ. లక్షన్నర అప్పు చేసి 2005లో మొదటిసారి అబుదాబికి వెళ్లాడు. రెండేళ్లు పని చేసి తిరిగి వచ్చి.. మళ్లీ 2007లో వెళ్లాడు. అబుదాబిలోని మస్ అనే బల్దియా కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడు. 2008లో అక్కడి క్యాంపస్‌లో పనిచేస్తుండగా పెద్ద ఇనుపగేట్ మీద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రాజయ్య కోమాలోకి వెళ్లాడు. ఆరేళ్ల నుం చి మాటా లేదు. ఇక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజయ్యకు చెల్లెలు లక్ష్మి ఉంది. అతడిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.