కథలాపూర్ మండలం దొంపేట గ్రామానికి చెందిన నక్కల లక్ష్మయ్య(55) గుండెపోటుతో గల్ఫ్‌లో ప్రాణాలు విడిచాడు.
కరీంనగర్ (కథలాపూర్) : కథలాపూర్ మండలం దొంపేట గ్రామానికి చెందిన నక్కల లక్ష్మయ్య(55) గుండెపోటుతో గల్ఫ్‌లో ప్రాణాలు విడిచాడు. లక్ష్మయ్య ఏడాదిన్నర క్రితం పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో స్టీల్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. గుండెపోటుతో సోమవారం మృతిచెందినట్లు తెలిసింది. కుటుంబసభ్యులకు ఆలస్యంగా మంగళవారం ఈ సమాచారం అందింది. లక్ష్మయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు.