
గల్ఫ్‌లో జీవచ్ఛవంలా ఆరేళ్లు
తుకుదెరువు కోసం ఎడారిదేశం వెళ్లిన ఓ అభాగ్యుడు ఆరేళ్లుగా జీవచ్ఛవంగా ఆస్పత్రి లో ఉన్నాడు. అచేతనావస్థలో ఉన్న అతడి పరిస్థితిపై స్పందించేవారే కరువయ్యారు.
కోనరావుపేట: బతుకుదెరువు కోసం ఎడారిదేశం వెళ్లిన ఓ అభాగ్యుడు ఆరేళ్లుగా జీవచ్ఛవంగా ఆస్పత్రి లో ఉన్నాడు. అచేతనావస్థలో ఉన్న అతడి పరిస్థితిపై స్పందించేవారే కరువయ్యారు. రాజయ్య బంధువుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన బడే రాజయ్య(40) రూ. లక్షన్నర అప్పు చేసి 2005లో మొదటిసారి అబుదాబికి వెళ్లాడు.
రెండేళ్లు పని చేసి తిరిగి వచ్చి.. మళ్లీ 2007లో వెళ్లాడు. అబుదాబిలోని మస్ అనే బల్దియా కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడు. 2008లో అక్కడి క్యాంపస్‌లో పనిచేస్తుండగా పెద్ద ఇనుపగేట్ మీద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రాజయ్య కోమాలోకి వెళ్లాడు. ఆరేళ్ల నుం చి మాటా లేదు. ఇక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజయ్యకు చెల్లెలు లక్ష్మి ఉంది. అతడిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.