వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు | joings into ysrcp from tdp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు

Sep 11 2016 8:44 PM | Updated on Sep 4 2017 1:06 PM

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు

బువ్వనపల్లి (నిడమర్రు) : రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేత, మండల దివ్యాంగుల సంక్షేమ కమిటీæమాజీ అ«ధ్యక్షుడు పొట్నూరి ఉమామహేశ్వరరావు అన్నారు. బువ్వనపల్లిలో గణపవరం సమితి మాజీ అ«ధ్యక్షుడు పుప్పాల ఏసుబాబు నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నిడమర్రుకు చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

బువ్వనపల్లి (నిడమర్రు) : రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేత, మండల దివ్యాంగుల సంక్షేమ కమిటీæమాజీ అ«ధ్యక్షుడు పొట్నూరి ఉమామహేశ్వరరావు అన్నారు. బువ్వనపల్లిలో గణపవరం సమితి మాజీ అ«ధ్యక్షుడు పుప్పాల ఏసుబాబు నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నిడమర్రుకు చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారంతా వాసుబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 70 వేల మంది ఓటర్లు వైఎస్సార్‌ సీపీ పక్షాన ఉన్నారన్నారు. 
మిగిలిన వారు చంద్రబాబు మాయమాటలను నమ్మి తప్పు చేశామనే బాధల్లో ఉన్నారని, వారందరినీ కలిసి భవిష్యత్‌పై నమ్మకం కలిగించేందుకే వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ‘గడప గడపకు వైఎస్సార్‌ ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు పార్టీ మారేవారు అవసరాల కోసం వచ్చేవారని, ముందుగా పార్టీలోకి వచ్చేవారు స్వచ్ఛమైన, నిజమైన కార్యర్తలని పేర్కొన్నారు. మండల కన్వీనర్‌ సంకు సత్యకుమార్‌ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిలో కన్నాజి రామకృష్ణ, మీసాల లక్ష్మీనారాయణ, బార్నాల త్రిమూర్తులు, పతివాడ లక్ష్మణస్వామి, పొట్నూరి త్రిమూర్తులు, పతివాడ శ్రీనివాసరావు, గొర్రెల సుబ్బారావు, పొట్నూరి శ్రీనివాసరావు, రెల్లి సత్యనారాయణ, కన్నాజి నాగరాజు, కన్నాజి సత్యనారాయణ, పెద్దిరెడ్డి సత్యనారాయణ, కోరాడ పైడయ్య, అల్లాడి అబ్బులు, ధనుకొండ బుజ్జి, కోడే కాశి, రాఘువులు, నిమ్మల రాము తదితరులున్నారు. 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement