రాహుల్ పర్యటనను అడ్డుకుంటాం: జేసీ | jc prabhakar reddy warns to stop rahul gandhi tour | Sakshi
Sakshi News home page

రాహుల్ పర్యటనను అడ్డుకుంటాం: జేసీ

Jul 13 2015 8:28 AM | Updated on Jun 1 2018 8:39 PM

రాహుల్ పర్యటనను అడ్డుకుంటాం: జేసీ - Sakshi

రాహుల్ పర్యటనను అడ్డుకుంటాం: జేసీ

రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

తాడిపత్రి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో 600 మంది రైతులు చనిపోయారని, మొదట వారికి పరిహారం చెల్లించాలని, అలాకాని పక్షంలో ఈ నెల 24న జిల్లాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు.

రాహుల్ మొదట కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. పరిహారం అందజేయాలన్నారు. ఆ తర్వాతే టీడీపీ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్నారు. అలాకాని పక్షంలో 300 వాహనాల్లో మృతుల కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకుంటామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement