 
															కుక్కల దాడిలో మూగజీవాల మృత్యువాత
కుక్కులదాడిలో ఏడు మూగజీవాలు మృతిచెందాయి
	డిండి :
	కుక్కులదాడిలో ఏడు మూగజీవాలు మృతిచెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని యర్రగుంట్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని యర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల రాములుకు చెందిన ఆరు గొర్రెలు, మేక దొడ్డిలో ఉండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో గాయపడి మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.  ప్రభుత్వం ఆర్థికసాయం చేసి బాధితుడిని ఆదుకోవాలని  టీఆర్‌ఎస్ మండల నాయకులు మల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.
	
	
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
