భార్యా బాధితుల సంఘం కేలండర్ విడుదల | husbands organisation released calender | Sakshi
Sakshi News home page

భార్యా బాధితుల సంఘం కేలండర్ విడుదల

Jan 1 2016 11:11 PM | Updated on Sep 3 2017 2:55 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్న భార్యా బాధితుల సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ‘ఏకం అవ్వండి.. ఏకం అవ్వండి.. ఓ భార్యా బాధితులారా’ అనే నినాదంతో కేలెండర్‌ను తాడేపల్లిగూడెంలో శుక్రవారం విడుదల చేసింది. సంఘం అధ్యక్షుడు జి.బాలాజీ వీటిని స్థానికులకు పంపిణీ చేశారు.

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా పనిచేస్తున్న భార్యా బాధితుల సంఘం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని.. ‘ఏకం అవ్వండి.. ఏకం అవ్వండి.. ఓ భార్యా బాధితులారా’ అనే నినాదంతో కేలెండర్‌ను తాడేపల్లిగూడెంలో శుక్రవారం విడుదల చేసింది. సంఘం అధ్యక్షుడు జి.బాలాజీ వీటిని స్థానికులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 498 (9), గృహ హింస కేసుల వల్ల బాధలు పడే భర్తలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతున్నారని, అలాంటి వారు మరో జీవితం పొందడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘాన్ని జాతీయ స్థాయిలో రిజిస్టర్ చేసినట్టు తెలిపారు. న్యాయపరమైన సలహాలు, సెక్షన్ల గురించి క్యాలెండర్ వెనుక భాగంలో పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement