పిల్లలు కలగలేదని భార్యపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టి హత్యాయత్నంచేసిన వ్యక్తికి స్థానికులు దేహశుద్దిచేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పిల్లలు కలగలేదని భార్యపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టి హత్యాయత్నంచేసిన వ్యక్తికి స్థానికులు దేహశుద్దిచేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం బెంగుళూరులో జరిగింది. వివరాలు. చిత్తూరు జిల్లా రామకుప్పం గ్రామానికి చెందిన గురప్ప, సుశీలమ్మ దంపతుల కుమార్తె శ్రీదేవిని పుంగనూరుకు చెందిన న్యాయవాది నాగరాజుకు ఇచ్చి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లిచేశారు.
పిల్లలు కలగలేదన్న ఆగ్రహంతో నాగరాజు మంగళవారం ఉదయం భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఈ సంఘటనలో శరీరం తీవ్రంగా కాలడంతో ఆమెను బెంగుళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు బెంగుళూరులో నాగరాజును పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిబారినుండి ఎలాగో తప్పించుకున్న నాగరాజు పరారయ్యాడు. ఈ విషయమై బాధితురాలి కుటుంబసభ్యులు పీఎస్ అగ్రహారం పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాక ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమార్తెపై హత్యాయత్నం చేసిన నాగరాజును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.