
వాహనం ఢీకొని హోంగార్డు మృతి
ప్యాయలవాండ్లపల్లి బస్ స్టాప్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఓ వాహనం ఢీకొనడంతో హోంగార్డు గోపాల్‌నాయక్ (40) అక్కడిక్కడే మృతి చెందాడు.
నల్లచెరువు : ప్యాయలవాండ్లపల్లి బస్ స్టాప్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఓ వాహనం ఢీకొనడంతో హోంగార్డు గోపాల్‌నాయక్ (40) అక్కడిక్కడే మృతి చెందాడు. నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకుని స్వగ్రామమైన బాలేపల్లితండాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపాల్‌నాయక్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.