అనంతపల్లిలో ‘హైటెన్షన్‌’ | ‘hightension ’ in anantapalli | Sakshi
Sakshi News home page

అనంతపల్లిలో ‘హైటెన్షన్‌’

Feb 13 2017 12:21 AM | Updated on Sep 5 2017 3:33 AM

అనంతపల్లిలో ‘హైటెన్షన్‌’

అనంతపల్లిలో ‘హైటెన్షన్‌’

అనంతపల్లి (నల్లజర్ల) : నల్లజర్ల మండలంలోని అనంతపల్లి జంక్షన్‌లో ఆది వారం మధ్యాహ్నం లారీ రహదారి పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభంపై ఉన్న 11 కేవీ, హైటెన్షన్‌ లైన్‌ (హెచ్‌టీ) కలిసిపోవడంతో తీగల నుంచి మంటలు చెలరేగాయి.

అనంతపల్లి (నల్లజర్ల) : నల్లజర్ల మండలంలోని అనంతపల్లి జంక్షన్‌లో ఆది వారం మధ్యాహ్నం లారీ రహదారి పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభంపై ఉన్న 11 కేవీ, హైటెన్షన్‌ లైన్‌ (హెచ్‌టీ) కలిసిపోవడంతో తీగల నుంచి మంటలు చెలరేగాయి. సమీపంలోని వల్లాల నాగబాబుకు చెందిన కిరాణా దుకాణం, ఇల్లు, చందూరి రామకృష్ణ, అడపా దుర్గారావు, కొండమూరి నాగేశ్వరావు ఇళ్లు, గిరి రామారావుకు చెందిన హోటల్, మీసేవ కేంద్రం పక్కనున్న జ్యూస్‌ దుకాణంలో సర్వీస్‌ వైర్లతో పాటు విద్యుత్‌ మీటర్లు, వైరిం గ్, బోర్డులు మాడిపోయాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఫ్యాన్లు, గీజర్లు, గ్రైం డర్లు కాలిపోయాయి. ఓ ఇంటి బయట నిలుచుకున్న అడపా ధనలక్షి్మకి, ఆమె చంకలోని షణ్ముఖప్రియకు గాయాలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుం చి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సాయంత్రం 6 గంటల సమయంలో విద్యుత్‌ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్టు సమాచారం.  
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement