దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు | heavy crowd at indrakiladri | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

Aug 18 2016 11:06 PM | Updated on Sep 4 2017 9:50 AM

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి పుష్కర యాత్రికులు బారులు తీరారు. పుష్కరాలు, శ్రావణ పౌర్ణమి కలిసి రావడంతో గురువారం రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. దేవస్థానికి రూ. 22.72 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : 

అమ్మవారి సన్నిధిలో అశోకగజపతిరాజు
దుర్గమ్మను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదాలను ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
 
Advertisement
 
Advertisement
Advertisement