భారీబందోబస్తు | heavy bandobast at bunny | Sakshi
Sakshi News home page

భారీబందోబస్తు

Oct 11 2016 12:00 AM | Updated on Aug 21 2018 5:54 PM

దసరా పండుగను పురస్కరించుకొని హోళగుంద మండలం దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని అరికట్టేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కర్నూలు:  దసరా పండుగను పురస్కరించుకొని హోళగుంద మండలం దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని అరికట్టేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు 41 మంది, ఏఎస్‌ఐలు హెడ్‌ కానిస్టేబుళ్లు 145 మంది, కానిస్టేబుళ్లు 458, స్పెషల్‌పార్టీ పోలీసులు 70 మంది, హోంగార్డులు 200 మందిని బందోబస్తు  విధులకు నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు, మఫ్టీ, స్పెషల్‌ పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు.
 
హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ
బన్ని ఉత్సవంలో శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా  ప్రతి ఒక్కరు తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఆకతాయిలు, అల్లరి మూకలు దాడులకు పాల్పడే విధంగా రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలపై, చిన్న పిల్లలపై, భక్తులకు నిప్పులు విసరడం, కర్రలతో రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిని వీడియో చిత్రీకరణ ద్వారా గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement