హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేస్తా | heart touching films | Sakshi
Sakshi News home page

హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేస్తా

Sep 30 2016 10:06 PM | Updated on Oct 2 2018 3:43 PM

హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీయాలనేది తన లక్ష్యమని ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడిన బిచ్చగాడు దర్శకుడు శశి తెలిపారు. తదుపరి తీయబోయే సినిమా షూటింగ్‌ నిమిత్తం లొకేషన్స్‌ చూసేందుకు శుక్రవారం ఆయన పసలపూడి గ్రామానికి వచ్చారు.

  • బిచ్చగాడు దర్శకుడు ‘శశి’
  • పసలపూడి (రాయవరం) :
    హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీయాలనేది తన లక్ష్యమని ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడిన బిచ్చగాడు దర్శకుడు శశి తెలిపారు. తదుపరి తీయబోయే సినిమా షూటింగ్‌ నిమిత్తం లొకేషన్స్‌ చూసేందుకు శుక్రవారం ఆయన పసలపూడి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీఏ సోషియాలజీ చదివిన తాను ఇప్పటి వరకు ఆరు సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. తెలుగులో తన తొలి సినిమా వెంకటేష్‌ హీరోగా ‘శీను’కు దర్శకత్వం వహించగా ‘బిచ్చగాడు’ రెండో సినిమా అన్నారు.  ఈ సినిమా ఘన విజయం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోగా నటించిన ‘ఓ పాపా లాలి’ సినిమా దర్శకడు వసంత్‌ వద్ద తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. కె.విశ్వనాథ్, శేఖర్‌ కమ్ముల, క్రిష్, కరుణాకరణ్‌ దర్శకత్వ పనితీరు తనను ఆకట్టుకున్నాయన్నారు. ఉత్తమ అభిరుచి ఉన్న సినిమాలు నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాకు దర్శకత్వం వహించనున్నానన్నారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. ఆయన వెంట యానాంకు చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ఏజెంట్‌ మడికి రామస్వామి, షార్ట్‌ఫిల్మ్స్‌ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, యానాం కథల రచయిత సాధనాల బాబు, సినీ నటుడు కర్రి రామారెడ్డి, జూనియర్‌ రాజనాల ఉన్నారు.  
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement