'పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారు' | Gutta sukhender reddy takes on kcr and chandrababu | Sakshi
Sakshi News home page

'పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారు'

Oct 21 2015 2:03 PM | Updated on Aug 15 2018 9:30 PM

'పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారు' - Sakshi

'పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారు'

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం నల్లొండలో నిప్పులు చెరిగారు.

నల్గొండ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం నల్లొండలో నిప్పులు చెరిగారు. మొన్నటి వరకు తిట్టుకున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు. కేసీఆర్, చంద్రబాబులు ఇరు రాష్ట్ర ప్రజలకు భారంగా మారారని ఆరోపించారు.

రైతు ఆత్మహత్యలు పట్టించుకోకుండా పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. బతుకమ్మ పేరుతో కేసీఆర్ రూ. 100 కోట్లు దుబారా చేశారన్నారు. బతుకమ్మ ఉత్సవాలను పలు ప్రభుత్వ శాఖలపై బలవంతంగా రుద్దారని కేసీఆర్పై గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement