తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి | Granulation TDP is invalid | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి

Oct 23 2016 11:39 PM | Updated on Aug 16 2018 4:12 PM

తెలుగుదేశం పార్టీకి  నూకలు చెల్లాయి - Sakshi

తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి

తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని వైఎస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

నందలూరు: తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని వైఎస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం ఆర్‌అండ్‌బి బంగ్లా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ బూటకపు హామీలతో
గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దీంతో విసిగి పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి
నిరసనగా ఒక్కొక్కరు వైఎస్సార్‌సిపీలోకి వలసలు వస్తున్నారని అన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు
అనుగుణంగా ఏర్పడిన పార్టీ వైఎస్సార్‌సీపీ  అని  అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సేవచేయడమే
మార్గంగా ఎన్నుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు.  రానున్నరోజుల్లో తెలుగుదేశంపార్టీకి డిపాజిట్‌కూడా దక్కదని
ఆయన జోçస్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో ప్రజలనుంచి అపూర్వ స్పందన
వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలవద్దకు వెళ్లినపుడు  చంద్రబాబునాయుడు గురించి, తెలుగుతమ్ముళ్ళ అరాచకాలగురించి   
తమకు ఫిర్యాదుచేస్తున్నారన్నారు. ప్రజల  కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన నాయకుడని, ప్రజలను మరిచిన ఏ
నేత ఎదిగినట్లు చరిత్రలో లేదని అన్నారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి
సుధాకర్, సిద్దవరం గోపిరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, గీతాల నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, అజీజ్, సుభాన్,
మోడపోతుల సుధాకర్, శివారెడ్డి, చల్లా నాగేంద్ర, అరిగెల సౌమిత్రి, విజయ్‌కుమార్, గాదెల శివయాదవ్‌ తదితరులు
పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement