కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస | governor admiration kurnool commentator | Sakshi
Sakshi News home page

కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస

Jan 27 2017 11:11 PM | Updated on Sep 5 2017 2:16 AM

కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస

కర్నూలు వ్యాఖ్యాతకు గవర్నర్ ప్రశంస

విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకల్లో కర్నూలుకు చెందిన వ్యాఖ్యాత ఇనాయతుల్లాను రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

కర్నూలు (అర్బన్‌):  విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకల్లో కర్నూలుకు చెందిన వ్యాఖ్యాత ఇనాయతుల్లాను రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. గణతంత్ర వేడుకల్లో ఇనాయతుల్లా  ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని అందించారు. వేడుకల అనంతరం జరిగిన హైటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, శాసన మండలి చైర్మన్‌ చక్రపాణియాదవ్, ప్రభుత్వ గౌరవసలహాదారు పరకాల ప్రభాకర్, శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు ఇనాయతుల్లాను అభినందించారు. కర్నూలు వ్యాఖ్యాతకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం హర్షణీయమని కర్నూలు తెలుగు కళాస్రవంతి అధ్యక్షుడు డా.ఎం.పీ.ఎం రెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌మియా, ప్రముఖ నవలా రచయిత ఎస్‌డీవీ అజీజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement