ఛత్తీస్‌గఢ్‌లోనూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా.. | gangster nayeem police informer to chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లోనూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా..

Aug 14 2016 7:01 AM | Updated on Aug 21 2018 7:39 PM

ఉమ్మడి ఏపీలో మాదిరిగానే నయీమ్ ఛత్తీస్‌గఢ్ పోలీసులకు నక్సల్స్‌కు సంబంధించిన సమాచారం అందించాడా?

హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో మాదిరిగానే నయీమ్ ఛత్తీస్‌గఢ్ పోలీసులకు నక్సల్స్‌కు సంబంధించిన సమాచారం అందించాడా? టెక్‌మధుతో కలసి ఎప్పటికప్పుడు ఉప్పందించాడా? అందుకే అక్కడ పెద్దఎత్తున ఎన్‌కౌంటర్లు జరిగాయా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు! వరంగల్‌కు చెందిన మాజీ మావోయిస్టు తోట కుమార స్వామి అలియాస్ టెక్ మధు అలియాస్ శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో నయీమ్ ఈ కార్యకలాపాలు సాగించినట్టు సమాచారం.

మావోయిస్టులకు రాకెట్ లాంచర్ల తయారీలో కీలకపాత్ర పోషించిన టెక్‌మధు.. ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్ గ్యాంగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. భువనగిరిలో అరెస్టయిన మరో మాజీ మావోయిస్టు రెవల్లి శ్రీనివాస్ కూడా టెక్‌మధుకు సాయంగా ఉన్నట్టు తేలింది. వీరి ద్వారా సమాచారం సేకరించిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు.. మావోయిస్టుల ఏరివేతకు సన్నద్ధమయ్యారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడ అత్యాధునిక ఆయుధాలతోపాటు 2 దేశీయ ఆయుధాలు దొరికాయి. ఇవి బిహార్‌లో రూ.వెయ్యికే దొరుకుతాయి. ఈ అత్యాధునిక ఆయుధాలు ఎక్కడ్నుంచి వచ్చాయనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement