రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతాం | G kishan reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతాం

Sep 16 2015 9:26 AM | Updated on Sep 3 2017 9:31 AM

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు.

నల్గొండ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండలో విలేకర్లతో కిషన్రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదు రోజులు కాకుండా 20 రోజుల పాటు జరిగేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైతుల ఆత్మహత్యలపై అన్ని పార్టీలతో కలసి కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదులు కుటుంబాన్ని నల్లగొండలో కిషన్రెడ్డి పరామర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement