ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం | four killed in visakha road accident | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం

Nov 5 2016 5:12 PM | Updated on Sep 4 2017 7:17 PM

విశాఖ జిల్లా రాయవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

విశాఖపట్టణం : విశాఖ జిల్లా రాయవరం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం ముందుగా డివైడర్ను ఢీకొని అనంతరం పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

వీరంతా గాజువాక నుంచి పాయకరావుపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గాజువాకకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement