మండలంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు ఉంటాయని తెలంగాణ బ్రాహ్మణ సంఘం మంగపేట అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి, నిర్వాహక కార్యదర్శులు గూడా వాసుదేవమూర్తి, అనిపెద్ది నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
31 నుంచి అంత్య పుష్కరాలు
Jul 24 2016 1:17 AM | Updated on Sep 4 2017 5:54 AM
మంగపేట : మండలంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు ఉంటాయని తెలంగాణ బ్రాహ్మణ సంఘం మంగపేట అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి, నిర్వాహక కార్యదర్శులు గూడా వాసుదేవమూర్తి, అనిపెద్ది నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంత్య పుష్క ర పుణ్య సమయంగా భావించి మహా పుష్కర పుణ్యసమయాన పితృదేవతలకు, వారి బంధువులు, స్నేహితులు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అలాగే గోదావరిలో సంకల్ప సహిత పుణ్యస్నానాలు, పవిత్ర గోదావరి దర్శనం, దాన ధర్మాలతో కూడిన కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చ న్నారు.
Advertisement
Advertisement