పంటకాల్వలోకి చేపల లారీ బోల్తా | fish lorry roll | Sakshi
Sakshi News home page

పంటకాల్వలోకి చేపల లారీ బోల్తా

Sep 30 2016 9:15 PM | Updated on Apr 3 2019 7:53 PM

పంటకాల్వలోకి చేపల లారీ బోల్తా - Sakshi

పంటకాల్వలోకి చేపల లారీ బోల్తా

చేపల లోడుతో వెళుతున్న లారీ పంటకాల్వలో దూసుకెళ్లింది. వివరాల ప్రకారం గురువారం రాత్రి కైకలూరు నుంచి ముంబై కి 10 టన్నుల చేపలతో లారీ బయిలు దేరింది. ముదినేపల్లి సమీపంలోకిరాగానే డ్రైవర్‌ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న పోలరాజ్‌ పంట కాల్వలోకి బోల్తా కొట్టింది. లారీ పూర్తిగా నీటిలో మునిగి పోయింది.

ముదినేపల్లి రూరల్‌: 
చేపల లోడుతో వెళుతున్న లారీ పంటకాల్వలో దూసుకెళ్లింది. వివరాల ప్రకారం గురువారం రాత్రి కైకలూరు నుంచి ముంబై కి 10 టన్నుల చేపలతో లారీ బయిలు దేరింది. ముదినేపల్లి సమీపంలోకిరాగానే డ్రైవర్‌ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న పోలరాజ్‌ పంట కాల్వలోకి బోల్తా కొట్టింది. లారీ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. లారీని క్రేన్‌ సహాయంతో బయటకు తీసేందుకు  నానా అవస్థలు పడ్డారు. రహదారిపై పలుసార్లు ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు లారీని కాలువ ఒడ్డుకు తీసి చేపలను మరో లారీలోకి మార్చారు. అధికలోడు, డ్రైవర్‌ అజాగ్రత్త వల్ల ప్రమాదంజరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రూ. 10 లక్షల సరుకులో కొంత నష్టపోయినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement