వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆటోనగర్ సమీపంలోని బాణాసంచా గోడౌన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆటోనగర్ సమీపంలోని బాణాసంచా గోడౌన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.... మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని గోడౌన్ యజమాని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.