ఆదిలాబాద్‌లో రైతన్న కన్నెర్ర | Farmer fires in Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో రైతన్న కన్నెర్ర

Nov 3 2015 12:50 AM | Updated on Oct 9 2018 2:17 PM

ఆదిలాబాద్‌లో రైతన్న కన్నెర్ర - Sakshi

ఆదిలాబాద్‌లో రైతన్న కన్నెర్ర

పత్తికి మద్దతు ధర దక్కకపోవడంతో ఆదిలాబాద్‌లో రైతన్నలు కన్నెర్ర చేశారు. సోమవారం మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడికి దిగారు.

మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి.. అద్దాలు ధ్వంసం
 
 ఆదిలాబాద్: పత్తికి మద్దతు ధర దక్కకపోవడంతో ఆదిలాబాద్‌లో రైతన్నలు కన్నెర్ర చేశారు. సోమవారం మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడికి దిగారు. అధికారులను బంధించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచే మార్కెట్‌కు రైతులు పత్తి తీసుకువచ్చారు. వ్యాపారులు వేలం(బీట్)లో క్వింటాల్‌కు రూ.3,900తో ప్రారంభించి రూ.4,050తో ముగించారు. నాలుగు రోజుల క్రితం ఉన్న ధరను రూ.200 వరకు తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగినా అధికారులు రాకపోవడంతో మార్కెట్ కార్యాలయంపై రాళ్ల వర్షం కురిపించారు. అన్నదాతల చేతిలో కార్యాలయ కిటికీల అద్దాలు ధ్వంసమయ్యూరుు. మార్కెట్ ఏడీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement